తెలంగాణ

telangana

ETV Bharat / state

నత్తేనయం: ఆర్థికం అడ్డొస్తోంది... అవగాహన లోపించింది! - ఇంకుడు గుంతలు నత్తనడక

'ఇంకుడు గుంత' ముందుకు సాగనంటోంది! ప్రభుత్వమెంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పథకం నత్తనడకన సాగుతోంది. 44 లక్షల గుంతలు లక్ష్యమని సర్కారు చెబుతోంది. క్షేత్రస్థాయిలో రెండు లక్షలు కూడా పూర్తికాకపోవడం అధికారుల నిబద్ధతకు నిదర్శనంగా మారింది. కారణాలేమైనా... బాధ్యులెవరైనా... అంతిమలక్ష్యం ఆమడదూరం వెళుతోంది!

soak pits delay in mahabubnagar
నత్తేనయం: ఆర్థికం అడ్డొస్తోంది... అవగాహన లోపించింది!

By

Published : Jan 18, 2020, 10:51 AM IST

పల్లెప్రగతిలో భాగంగా ఇంటింటికీ ఇంకుడుగుంత నిర్మించాలని ప్రభుత్వం భావించింది. కానీ.. అది 'ఓ అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి' అన్న చందంగా మారింది. మహబూబ్​నగర్ జిల్లాలోని పల్లెప్రగతిలో భాగంగా సుమారు లక్ష 5వేల ఇంకుడు గుంతలు నిర్మించాలనేది లక్ష్యం. ఇప్పటివరకూ 35వేలు పూర్తి కాగా, మరో 35వేలు నిర్మాణంలో ఉన్నాయి.
జోగులాంబ గద్వాల జిల్లాలో లక్షా 36వేలు, నాగర్ కర్నూల్ జిల్లాలో లక్షా 67వేలు, వనపర్తిలో లక్షా 20వేలు, నారాయణపేట జిల్లాలో 79వేల ఇంకుడు గుంతలు తవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. ఇప్పటి వరకూ 10 శాతం లక్ష్యాన్ని కూడా చేరుకోలేదు.

నత్తేనయం: ఆర్థికం అడ్డొస్తోంది... అవగాహన లోపించింది!
లక్ష్యానికి నేలపాట్లు... కొన్ని చోట్లు ఇంకుడు గుంతలు తవ్వడానికి నేల అనుకూలంగా లేదు. మరికొన్ని చోట్ల రాతి పొరలు.. తక్కువ ఎత్తులో నీళ్లు ఊరటం ఇలా అనేక కారణాలతో పని పూర్తికాలేదు. ఇటీవలే మహబూబ్​నగర్​ పాలనాధికారి రొనాల్డ్​రోస్​ ప్రత్యామ్నాయంగా భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.. కానీ అదీ కార్యరూపం దాల్చలేదు. దీనికితోడు ఆర్థిక పరిస్థితి వేధిస్తోంది. అవగాహన లోపం.. ఇంకుడు గుంతలపై ప్రజల్లో అవగాహన కొరవడింది. స్థలాభావం వల్ల కొందరు గుంతల నిర్మణానికి ముందుకు రావడం లేదు. మరికొందరు మురికినీళ్లు ఇంట్లోనే వదులుకోవడంపై నిరాసక్తత చూపిస్తున్నారు. అధికారుల అలసత్వం.. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం... ప్రజల నిరాసక్తత... వెరసి 'ఇంకుడు గుంత' కదలనంటోంది! ఇదిలాగే కొనసాగితే సర్కారు లక్ష్యం నెరవేరడం కలే!

ABOUT THE AUTHOR

...view details