తెలంగాణ

telangana

ETV Bharat / state

సీరియల్​ కిల్లర్​ అరెస్టు - mahabubnagar

డబ్బుకోసం వరుస హత్యలు చేస్తున్న సీరియల్​ కిల్లర్​ను పోలీసులు అరెస్టు చేశారు. 2003 నుంచి నిందితుడిపై 12 హత్యకేసులతో పాటు 4 దొంగతనం కేసులు నమోదైనట్లు మహబూబ్​నగర్​ ఎస్పీ తెలిపారు.

వరుస హత్యలు చేస్తున్న వ్యక్తి అరెస్టు

By

Published : Mar 6, 2019, 4:29 PM IST

వరుస హత్యలు చేస్తున్న వ్యక్తి అరెస్టు
వరుస హత్యలు చేస్తున్న ఎండీ.యూసుఫ్‌ను మహబూబ్‌నగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 2003 నుంచి ఇప్పటి వరకు 12 హత్య కేసులతో పాటు నాలుగు దొంగతనం కేసులు నమోదైనట్లు మహబూబ్‌నగర్ ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. నిందితుడు మహబూబ్‌నగర్‌ జిల్లా చుక్కంపేట గ్రామానికి చెందినవాడని తెలిపారు. ఈ ఏడాది నవాబుపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఓ హత్య కేసును శోధిస్తున్న పోలీసులకు సీరియల్‌ కిల్లర్‌ వివరాలు తెలిసినట్లు ఆమె చెప్పారు. ఈ రోజు ఉదయం వికారాబాద్ జిల్లా చౌడాపూర్‌ గ్రామంలో పట్టుబడ్డట్టు వివరించారు.

కేవలం డబ్బులు అవసరమైనప్పుడే ఈ హత్యలకు పాల్పడుతున్నట్టు పోలీసుల విచారణలో తేలిందన్నారు ఎస్పీ. అతనిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్టు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details