తెలంగాణ

telangana

ETV Bharat / state

నూతన ఒరవడితో జన అదాలత్​: శ్రీనివాస్​

తెలంగాణను ఎస్సీ, ఎస్టీలపై దాడులు, అత్యాచారాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆ కమిషన్​ ఛైర్మన్​ డాక్టర్​ ఎర్రోళ్ల శ్రీనివాస్​ కోరారు. మహబూబ్​నగర్ జిల్లాలో ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహించిన జన అదాలత్​లో 10 కేసులను విచారించినట్లు తెలిపారు. 16, 17, 18 తేదీల్లో ఉమ్మడి సంగారెడ్డి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.

By

Published : Dec 11, 2020, 4:39 AM IST

sc st commission tour end in mahabubnagar district
నూతన ఒరవడితో జన అదాలత్​: శ్రీనివాస్​

మహబూబ్​నగర్ జిల్లాలో ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహించిన జన అదాలత్​లో 10 కేసులను విచారించినట్లు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు. ఏళ్లనాటి సమస్యలను పరిష్కరించామని వెల్లడించారు. మహబూబ్​నగర్​లోని రెవెన్యూ సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా నూతన ఒరవడితో జన అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని శ్రీనివాస్​ తెలిపారు. నాగర్ కర్నూల్, మహబూబ్​నగర్ జిల్లాలకు సంబంధించి 4 కేసులను పరిష్కరించామని, వనపర్తి జిల్లాకు సంబంధించి రెండు కేసులు, గద్వాల జిల్లాకు సంబంధించి ఒక కేసు విచారణ పూర్తి కావాల్సి ఉందని వివరించారు.

చట్టబద్ధంగా ఎస్సీ, ఎస్టీలకు రావాల్సిన భూములను ఎవరైనా కబ్జా చేస్తే కమిషన్ చూస్తూ ఊరుకోదని శ్రీనివాస్​ హెచ్చరించార. ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే వారిపైనా చర్యలు తప్పవన్నారు. ప్రతి నెల 30న పౌర హక్కుల దినం, 3 నెలలకోసారి జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశాలను తప్పకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను కోరినట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఈ నెల 16, 17, 18 తేదీల్లో ఉమ్మడి సంగారెడ్డి జిల్లాలో జన అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.

ఎస్సీ, ఎస్టీలు తమపై దాడులు జరిగాయని కేసులు నమోదు చేసేందుకు వచ్చినప్పుడు కౌంటర్ కేసు దాఖలు కాకుండా చూసుకోవాలని జిల్లా ఎస్పీలను కోరామని శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రాన్ని ఎస్సీ, ఎస్టీలపై దాడులు, అత్యాచారాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

ఇదీ చూడండి: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు హైకోర్టు అనుమతి

ABOUT THE AUTHOR

...view details