sarpanch son argue with mla : మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర గ్రామ పంచాయతీ వద్ద జరిగిన కార్యక్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచోసుకుంది. గ్రామంలో ఏర్పాటు చేసిన చెత్తసేకరణ వాహనాల పంపిణీకి ఎమ్మెల్యే, కలెక్టర్‌ను ఆహ్వానించారు గ్రామస్థులు. కానీ కలెక్టర్ వెంకట్రావు కార్యక్రమానికి హాజరుకాలేదు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి హాజరై వాహనాలను ప్రారంభించారు. ఈ విషయమై స్థానిక సర్పంచ్ కుమారుడు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా.. గ్రామానికి వచ్చి ఆదరాబాదరాగా వాహనాలను ప్రారంభించి ఎలా వెళ్లిపోతారంటూ ప్రశ్నించారు.
sarpanch son argue with mla : ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగిన సర్పంచ్ కుమారుడు.. ఏమైందంటే.. - మహబూబ్‌నగర్ వార్తలు
sarpanch son argue with mla : మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో చెత్తసేకరణ ఆటోల ప్రారంభోత్సవంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ప్రారంభ కార్యక్రమానికి కలెక్టర్ హాజరుకావాల్సి ఉండగా.. ఎమ్మెల్యే హాజరై ప్రారంభించడంతో... సమచారం ఇవ్వకుండా ఎలా వచ్చారని దేవరకద్ర సర్పంచ్ కుమారుడు ఎమ్మెల్యేను ప్రశ్నించారు.
జిల్లా కలెక్టర్.. వేరే మీటింగ్‌లో ఉండడం వల్ల హాజరుకాలేకపోయారని.. అందుకే తాను హాజరైనట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. అయితే తాము జిల్లా కలెక్టర్‌ను ఆహ్వానించి గ్రామంలో సమస్యలు విన్నవించుకునేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని.. ఇలా ఆదరాబాదరాగా వచ్చి వెళ్లిపోతే ఎలా అని గ్రామ సర్పంచ్ కుమారుడు టీపీసీసీ కార్యనిర్వాహక కార్యదర్శి కొండ ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. కార్యక్రమానికి ఎవరెవరు హాజరవుతున్నారో కనీసం గ్రామపంచాయతీకి సమాచారం ఇవ్వకపోవడం ఏంటని నిలదీశారు. ఈ సందర్భంగా కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ నెల 19 తర్వాత ప్రత్యేకంగా గ్రామ సభ నిర్వహిస్తే జిల్లా కలెక్టర్‌ను తీసుకొచ్చి సమస్యలను పరిష్కరించేందుకు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
ఇదీ చూడండి:corporator house demolished: తెరాస కార్పొరేటర్ ఇంటిని కూల్చేసిన అధికారులు.. ఎందుకంటే?