అలంరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
అంతరించిపోతున్న కళల పరిరక్షణకు అందరూ కృషి చేయాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ సూచించారు.
రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా మహబూబ్ నగర్ కేంద్రంలోని జిల్లా పరిషత్ మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కలెక్టర్ రోనాల్డ్ రోస్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, భద్రాచలం తదితర ప్రాంతాల కళాకారులు ప్రదర్శించిన కళారూపాలు అందరినీ ఆకట్టుకున్నాయి. భద్రాచలం జిల్లా గుత్తికోయల డోలు వాయిద్యం, గోండు కళాకారుల కింక్రీ వాద్యాలు అలరించాయి. ఈ సంబరాల్లో పాల్గొన్న కళాకారులందరికీ జిల్లా కలెక్టర్ జ్ఞాపికలు అందించి అభినందించారు.