మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో సఖి కేంద్రం మహిళలపై హింస, అఘాయిత్యాలను తగ్గించడానికి, మహిళాలోకానికి అండగా నిలిచేందుకు ప్రభుత్వం ప్రారంభించిన సఖీ కేంద్రాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. మహబూబ్నగర్ ప్రభుత్వాసుపత్రి ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన సేవలను ఆయన ప్రారంభించారు.
న్యాయపరమైన సహాయం...
హింసకు, అన్యాయానికి గురైన మహిళలకు వైద్యం, పోలీసు, న్యాయ పరమైన సహాయాన్ని అందించేందుకు సఖీ కేంద్రం పనిచేస్తుందని మంత్రి చెప్పారు. దాడులకు కుంగిపోకుండా... ధైర్యంగా ఎదుర్కొనేందుకు చట్టపరంగా మహిళలకు కావాల్సిన సహాయాన్ని అందిస్తుందని మంత్రి తెలిపారు.
విస్తృత అవగాహన...
కౌన్సిలర్లు, మానసిక వైద్య నిపుణులు, న్యాయవాదులు, పోలీసులు అందుబాటులో ఉండనున్నారు. సఖీ కేంద్రంపై అంగన్వాడీలు గ్రామాల్లో అవగాహన కల్పించాలని శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. అవసరాన్ని బట్టి అదనపు సౌకర్యాలు ఏమైనా కావాలన్నా సహకారం అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి:పులి గాడ్రింపు పదిలం