తెలంగాణ

telangana

ETV Bharat / state

Rythu bandhu Stopped: గంజాయి సాగు చేసిన రైతు.. రైతుబంధు బంద్​ చేసిన అధికారులు

Rythu bandhu Stopped : గంజాయి సాగు చేయొద్దన్న ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేసిన ఓ రైతుకు అధికారులు షాక్ ఇచ్చారు. రైతుబంధు పథకం అర్హుల జాబితా నుంచి అతని పేరు తొలగించారు.

Rythu bandhu cut
గంజాయి సాగు చేసిన రైతు

By

Published : Feb 6, 2022, 8:28 AM IST

Rythu bandhu Stopped : గంజాయి సాగు చేయొద్దని ప్రభుత్వం పలుసార్లు హెచ్చరించినా ఆ రైతు పట్టించుకోలేదు. తన పంట పొలంలో గంజాయి సాగు చేశారు. ఆ రైతు పేరును వ్యవసాయ శాఖ అధికారులు రైతుబంధు పథకం అర్హుల జాబితా నుంచి తొలగించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో గంజాయి సాగుపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందనడానికి ఇదొక ఉదాహరణ.

ఆబ్కారీ, రెవెన్యూ శాఖల అధికారులు గత అక్టోబరులో మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలం మణికొండ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. మణికొండ గ్రామానికి చెందిన జి.చంద్రయ్య అనే రైతు తన పొలంలో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్లు వెలుగుచూసింది. విషయాన్ని మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌ వెంకట్‌రావు దృష్టికి తీసుకెళ్లగా ఆ రైతుకు రైతుబంధు పథకం కింద వచ్చే రూ.7,500 అందించొద్దని ఆదేశించారు. ఈ మేరకు చంద్రయ్య పేరును పథకం అర్హుల జాబితాలోంచి తొలగించామని, వచ్చే పంటకాలంలో పెట్టుబడి సాయం అందదు అని శనివారం వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details