తెలంగాణ

telangana

ETV Bharat / state

'కోర్టును గౌరవించి విధులకు వస్తే.. అరెస్ట్ చేస్తారా?' - Rtc workers protest in palamooru

తమను విధుల్లో చేర్చుకోవాలంటూ ఆర్టీసీ కార్మికులు మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలో ఆందోళన నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కార్మిక కార్యాలయాన్ని ముట్టడించారు.

అరెస్ట్ చేస్తారా?'
అరెస్ట్ చేస్తారా?'

By

Published : Nov 27, 2019, 7:56 PM IST

పారిశ్రామిక వివాదాల చట్టానికి వ్యతిరేకంగా తమ హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలో కార్మిక శాఖ కార్యాలయం ముట్టడి నిర్వహించి అనంతరం వినతి పత్రం అందజేశారు. సమ్మె విరమించిన అనంతరం విధుల్లో చేరే హక్కు కార్మికులకు ఉందని... ఈ హక్కును కూడా రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించడం న్యాయం కాదని మండిపడ్డారు. ఇప్పటికైనా సర్కారు స్పందించి కార్మికులను ఉద్యోగాలలో చేర్చుకోవాలని కోరారు. ఉన్నత న్యాయస్థానాన్ని గౌరవించి విధులకు హాజరయ్యేందుకు వస్తే... పోలీసులు తమపై దాడులు చేస్తూ... అరెస్టు చేశారని మండిపడ్డారు.

పాలమూరులో కార్మికుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details