ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ప్రజా సంఘాల నేతలు, ఆర్టీసీ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. అంబేడ్కర్ చౌరస్తాలో ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలని కోరారు. వెంటనే కార్మికులతో చర్చించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ప్రధాన రహదారిపై బైఠాయించడం వల్ల ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న పోలీసులు నిరసనకారుల ఆందోళనను విరమింపజేశారు. కార్మికుల పట్ల ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని సీపీఐ, సీపీఎం, ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు.
జడ్చర్లలో ఆర్టీసీ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన ... - జడ్చర్లలో ప్రజా సంఘాల నేతలు, ఆర్టీసీ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన
మహబూబ్ నగర్ జిల్లాలో తమ సమస్యలు పరిష్కరించాలని ప్రజా సంఘాలు, ఆర్టీసీ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.
![జడ్చర్లలో ఆర్టీసీ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన ...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4879652-thumbnail-3x2-ardha-nagna.jpg)
సమస్యలను తీర్చాలని జడ్చర్లలో ఆర్టీసీ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన
సమస్యలను తీర్చాలని జడ్చర్లలో ఆర్టీసీ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన