ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్లో చిచ్చుపెట్టి కొందరు లబ్ధి పొందాలని భావిస్తున్నారని నాయకులు ఆరోపించారు. వారి ఆటలు సాగవని... తమ నాయకుడు అశ్వత్థామ రెడ్డేనని కార్మికులు తీర్మానించారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ఉమ్మడి జిల్లాలోని 9 ఆర్టీసీ డిపోలకు చెందిన మజ్దూర్ యూనియన్ నాయకులతో సమావేశం నిర్వహించారు.
'ఎవరెన్ని కుట్రలు చేసినా.. అశ్వత్థామరెడ్డే మా లీడర్' - mahaboobangar news
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ఉమ్మడి జిల్లాలోని 9 ఆర్టీసీ డిపోలకు చెందిన మజ్దూర్ యూనియన్ నాయకులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ అశ్వత్థామరెడ్డిని అప్రతిష్ఠపాలు చేయడానికి యూనియన్లోని థామస్ రెడ్డి పని చేస్తున్నారని నాయకులు ఆరోపించారు.
!['ఎవరెన్ని కుట్రలు చేసినా.. అశ్వత్థామరెడ్డే మా లీడర్' rtc union meeting in jadcharla](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9094835-7-9094835-1602138991109.jpg)
rtc union meeting in jadcharla
తెలంగాణ మజ్దూర్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రవీందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ రెడ్డితో పాటు సంయుక్త కార్యదర్శి లక్ష్మణ్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు వీఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అశ్వత్థామరెడ్డిని అప్రతిష్ఠపాలు చేయడానికి యూనియన్లోని థామస్ రెడ్డి పని చేస్తున్నారని నాయకులు ఆరోపించారు. వారి ఆటలు సాగవని.... తామంతా అశ్వత్థామ రెడ్డి వెంటే ఉంటామని తీర్మానించారు.