ఆర్టీసీ కార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. ఉద్యోగాలు తీసేస్తామన్నా... ఎవరూ ధైర్యం కోల్పోవద్దన్నారు. ఆర్టీసీ ఎవరి జాగీరు కాదన్నారు. దోపిడీని అడ్డుకునేందుకే సమ్మె చేస్తున్నామని చెప్పారు. అంతిమ విజయం ఆర్టీసీ కార్మికులదేనని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ మాటలకు ఎవరూ భయపడవద్దని.. యూనియన్లు అస్తిత్వం కోల్పోతే ఇంత పెద్ద సమ్మె జరిగేదా అని ప్రశ్నించారు. తెలంగాణ సమాజం తమ వెంటే ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 30న ఆర్టీసీ కార్మికుల సమరభేరీకి అందరూ తరలిరావాలని కోరారు.
ఆర్టీసీ ఎవరి జాగీరు కాదు: అశ్వత్థామరెడ్డి - rtc strike in telangana
ఆర్టీసీ ఎవరి జాగీరు కాదని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. ప్రజల ఆస్తుల రక్షణకే ఆర్టీసీ సమ్మె చేపట్టామన్నారు. ఉద్యోగాలు తీసేస్తామన్నా... ఎవరూ ధైర్యం కోల్పోవద్దన్నారు. అంతిమ విజయం తమదేనన్నారు.
![ఆర్టీసీ ఎవరి జాగీరు కాదు: అశ్వత్థామరెడ్డి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4858295-thumbnail-3x2-as.jpg)
అశ్వత్థామరెడ్డి
ఆర్టీసీ ఎవరి జాగీరు కాదు: అశ్వత్థామరెడ్డి