ROB Construction Issue In Mahabubnagar District : నాగర్ కర్నూల్, వనపర్తి నుంచి జడ్చర్ల మీదుగా హైదరాబాద్‌కు వెళ్లాలంటే.. రైల్వే పైవంతెనను దాటాలి. మహబూబ్‌నగర్ నుంచి కల్వకుర్తికి వెళ్లాలన్నా.. ఆ వంతెన నుంచే ప్రయాణం చేయాలి. అవే కాకుండా జడ్చర్లలో రైల్వేట్రాక్ అవతలి నుంచి ఇవతలికి రావాలంటే ఉన్నది ఆ ఒక్క మార్గమే. నిత్యం వేలాది వాహనాలు ప్రయాణించే పాత వంతెనను తొలిగించి, రెండు వరుసల్లో కొత్త వంతెనను నిర్మించకపోవడం వల్ల జడ్చర్లలో ట్రాఫిక్ సమస్యకు కారణమవుతోంది. ఏళ్లుగా ఆర్వోబీ (ROB In mahabubnagar)నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది.
ROB in Devarakadra : దేవరకద్రలో తుది దశకు ఆర్వోబీ పనులు.. గంటల కొద్ది నిరీక్షణకు తెర
Delay in ROB Construction in Mahabubnagar District : కోదాడ-రాయచూరు 167వ నంబర్ జాతీయ రహదారిపై మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల సిగ్నల్ గడ్డ వద్ద నిర్మించాల్సిన రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో జాప్యం.. జడ్చర్లలో ట్రాఫిక్ సమస్యకు కారణమవుతోంది. అక్కడ పాత వంతెన స్థానంలో కొత్త వంతెన నిర్మాణం చేపట్టాల్సి ఉన్నా.. ఏళ్లుగా పనులు నత్తనడకన సాగడం ఇబ్బందిగా మారింది. రోడ్డు ధ్వంసమై భారీ గుంతలు ఏర్పడ్డాయి. చిన్న అడ్డంకి ఏర్పడినా ట్రాఫిక్ స్తంభించిపోతోంది. ఆ వంతెన గుండా ప్రయాణించాల్సిన వేలాది వాహనదారులు.. నిత్యం నరకం అనుభవిస్తున్నారు. వనపర్తి, నాగర్ కర్నూల్‌కు జడ్చర్ల మీదుగా హైదారాబాద్ వెళ్లే వాహనాలు, మహబూబ్‌నగర్ నుంచి కల్వకుర్తి వెళ్లే వాహనాలు, పట్టణంలో ట్రాక్ అవతలి నుంచి ఇవతలికి వెళ్లే వాహనాలతో నిత్యం ఆర్వోబీ రద్దీగా ఉంటోంది.
"సిగ్నల్ గడ్డ దగ్గర నుంచి వెళ్లాలి అనుకుంటే ఒకటే రహదారి. అలా వెళ్లడానికి కుదరదు. సాయంత్రం 4 గంటలు దాటిందంటే స్కూల్స్, కాలేజీలు అయిపోయే సమయం.. అప్పుడు చాలా ట్రాఫిక్ ఉంటుంది. వర్షాకాలం వస్తే సమస్య ఎక్కువవతుంది. పూర్తి చేస్తామని చెప్తున్నారు కానీ పనులు మాత్రం చేయడం లేదు. అంబులెన్స్ వెళ్లాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడైనా ప్రభుత్వం పూర్తి చేయాలని కోరుతున్నాం." - స్థానికులు