తెలంగాణ

telangana

ETV Bharat / state

అదుపుతప్పి స్కూటీని ఢీకొట్టిన కారు.. యువతి మృతి! - మహబూబ్​ నగర్​ జిల్లా వార్తలు

ముందు వెళ్తున్న వాహనాన్ని అధిగమించబోయిన కారు.. ఎదురుగా వస్తున్న స్కూటీని బలంగా ఢీకొట్టిన ఘటనలో యువతి మృతిచెందిన ఘటన మహబూబ్​నగర్​ జిల్లా దేవరకద్ర మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Road Accident in mahabub nagar devara kadra
అదుపుతప్పి స్కూటీని ఢీకొట్టిన కారు.. యువతి మృతి!

By

Published : Aug 3, 2020, 7:57 PM IST

మహబూబ్​ నగర్​ జిల్లా దేవరకద్ర మండలం చౌదర్​పల్లి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి మృతి చెందగా, యువకుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. నారాయణపేటకు చెందిన బాధితురాలు స్వగ్రామం నుంచి దేవరకద్ర మీదుగా స్నేహితుడితో కలిసి స్కూటీ మీద మహబూబ్​నగర్ వైపు వెళ్తోంది. మన్యంకొండ సమీపంలోకి రాగానే.. ఎదురుగా వస్తున్న కారు వేరే వాహనాన్ని అధిగమించే ప్రయత్నంలో స్కూటీని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన యువతి, యువకుడిని అంబులెన్సులో జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా.. యువతి మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. తరలించారు. యువకుడికి రెండు కాళ్లు విరిగాయి. ఈ ప్రమాదంతో రెండు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కారును, స్కూటీని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి.. విచారణ చేపట్టారు.

ఇదీ చూడండి :పీఎస్​కు వచ్చే ఫిర్యాదు పేపర్లను ఇస్త్రీ చేస్తున్న పోలీసులు

ABOUT THE AUTHOR

...view details