దేవరకద్రలో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి - road accident at koyel sagar road
దేవరకద్రలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని.. ఆటో ఢీ కొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరు గాయపడ్డారు.
మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని.. ఆటో ఢీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సోమవారం సాయంత్రం పాఠశాల విద్యార్థులను, ప్రయాణికులకు తీసుకొని అజిలాపూర్ వెళ్తున్న ఆటో.. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న పట్నం బాబు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు గాయపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు.