తెలంగాణ

telangana

ETV Bharat / state

పాలమూరులో ప్రశాంతంగా సహకార పోలింగ్​ - mahabubnagar district news today

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సహకార ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 70 ప్రాథమిక సంఘాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందులోని 662 వార్డుల్లో 1652 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

Right now calm sahara elections polling at mahabubnagar district
పాలమూరులో ప్రస్తుతం.. ప్రశాంతంగా పోలింగ్​

By

Published : Feb 15, 2020, 10:31 AM IST

పాలమూరులోని ఐదు జిల్లాల్లో కలిపి 76 ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో 6 సంఘాలతోపాటు 13 డైరెక్టర్ల వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 70 సంఘాలకు ఉదయం ఏడు గంటలనుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఇక 921 డైరెక్టర్ల వార్డులకు, 259 ఏకగ్రీవం కాగా, మిగిలిన 662 వార్డుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.

జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్​ కొనసాగుతుండగా, మధ్యాహ్నం ఒంటి గంటతో పోలింగ్ ముగియనుంది. ఆ తర్వాత రెండు గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ జరగనుంది.

పాలమూరులో ప్రస్తుతం.. ప్రశాంతంగా పోలింగ్​

ఇదీ చూడండి :ఉత్పత్తి ఎక్కువ.. ఆదాయం తక్కువ..

ABOUT THE AUTHOR

...view details