తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈనాడు ఎఫెక్ట్​: మట్టి అక్రమ రవాణాచేస్తే క్రిమినల్​ కేసులే.. - మహబూబ్​నగర్​లో మట్టి అక్రమ రవాణాపై ఈనాడు కథనంపై స్పందించిన అధికారులు

మట్టి అక్రమ రవాణాపై ఈనాడు-ఈటీవీలో ప్రసారమైన కథనంపై అధికారులు స్పందించారు. మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రం అప్పనపల్లి శివారులో మట్టి అక్రమ రవాణాపై 'పాలమూరులో మట్టి మాఫియా' పేరుతో ఈనాడు పత్రికలో కథనం ప్రచురితమైంది.

ఈనాడు ఎఫెక్ట్​: మట్టి అక్రమ రవాణాచేస్తే క్రిమినల్​ కేసులే..

By

Published : Nov 13, 2019, 11:25 PM IST

మహబూబ్​నగర్ జిల్లా కేంద్రం అప్పనపల్లి శివారులో యథేచ్ఛగా సాగుతున్న మట్టి అక్రమ రవాణాపై ఈనాడు-ఈటీవీ ప్రసారం చేసిన కథనంపై అధికారులు స్పందించారు. మహబూబ్ నగర్ అర్బన్ మండలం రెవిన్యూ ఇన్​స్పెక్టర్​ క్రాంతి... సిబ్బందితో కలిసి వచ్చి మట్టి తవ్వకాలు జరిపిన ప్రాంతాన్ని పరిశీలించారు. చాలాకాలంగా అప్పనపల్లి శివారులో మట్టిని అక్రమంగా తరలించినట్లు గుర్తించామని తెలిపారు.

అధికారుల అనుమతి లేకుండా మట్టి తరలించడానికి వీలు లేదని... ఇకపై మట్టిని తరలించే ప్రయత్నం చేస్తే.. క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటి వరకు జరిగిన అక్రమాలపైన విచారణ జరుపుతామన్నారు. మట్టి మాఫియాపై నిఘా పెంచాలని వీఆర్వో, వీఆర్ఏలను ఆదేశించారు.

ఈనాడు ఎఫెక్ట్​: మట్టి అక్రమ రవాణాచేస్తే క్రిమినల్​ కేసులే..

ఇదీ చూడండి: పాలమూరులో యథేచ్ఛగా మట్టి దందా

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details