రామలింగేశ్వర ఆలయం వద్ద విశ్రాంతి గదులు ప్రారంభం - రామలింగేశ్వర ఆలయం వద్ద విశ్రాంతి గదులు ప్రారంభం
మహబూబ్నగర్ జిల్లాలోని కందూర్ గ్రామంలోని రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద విశ్రాంతి గదులను పార్లమెంటు సభ్యులు మన్నె శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర శాసనసభ సభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి ప్రారంభించారు.

రామలింగేశ్వర ఆలయం వద్ద విశ్రాంతి గదులు ప్రారంభం
మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం కందూర్ గ్రామంలోని రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద విశ్రాంతి గదులను ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. పూజారులు ఎంపీ, ఎమ్మెల్యేలకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయ పరిసరాల్లో గల కోనేరును పరిశీలించి అనంతరం రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయానికి వచ్చే భక్తులకు విశ్రాంతి గృహాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయని ఎంపీ తెలిపారు. అనంతరం గ్రామ ప్రజలతో పలు అంశాల గురించి చర్చించారు.
రామలింగేశ్వర ఆలయం వద్ద విశ్రాంతి గదులు ప్రారంభం