వరుసగా కురుస్తున్న వర్షాలతో, జూరాల ప్రాజెక్టు నుంచి లిఫ్ట్ ద్వారా వచ్చి చేరుతున్న నీటితో కోయిల్ సాగర్ ప్రాజెక్టు జలాశయ నీటి నిల్వ 26 అడుగులకు చేరింది. ప్రాజెక్ట్ కిందనున్న ఆయకట్టు చెరువులను నీటితో నింపాలని దేవరకద్ర, నారాయణపేట ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఎస్.రాజేందర్ రెడ్డి ప్రాజెక్టు సందర్శించి కుడి ఎడమ కాల్వల ద్వారా చెరువులను నింపేందుకు నీటిని విడుదల చేశారు. లిఫ్ట్ ద్వారా కోట్లు ఖర్చు పెట్టి తీసుకొచ్చిన నీటిని రైతులు వృథా చేయకుండా ఎక్కడికక్కడ ఆయా గ్రామాల చెరువులు నిండిన వెంటనే కిందనున్న గ్రామాల చెరువులకు నీటిని వదలాలని కోరారు.
కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల - కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల
మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల మధ్యనున్న కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని ఆయకట్టు చెరువులకు దేవరకద్ర, నారాయణపేట ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఎస్.రాజేందర్ రెడ్డి విడుదల చేశారు.
![కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8156923-518-8156923-1595592274439.jpg)
కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల
సకాలంలో వర్షాలు, లిఫ్ట్ ద్వారా వస్తున్న నీటిని సద్వినియోగం చేసుకొని రెండు పంటలు పండించే అవకాశం ఉందన్నారు. ప్రాజెక్టు మరమ్మతుల కోసం.. అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రాజెక్టు ఈఈ చక్రధర్ కు సూచించారు. కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుంచి ఆయకట్టు చెరువులకు నీటిని విడుదల చేయగా... రైతులు ఆనందం వ్యక్తం చేశారు.