తెలంగాణ

telangana

ETV Bharat / state

Palamuru -Ranga Reddy Lift Irrigation: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై నేడు ప్రజాభిప్రాయ సేకరణ

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రెండోదశ పనుల కోసం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు సర్వం సిద్ధమైంది. నేడు ఆరు చోట్ల ప్రజాభిప్రాయ సేకరణ జరగనుండగా.. అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రజల మద్దతు కూడగట్టేందుకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. నిర్వాసితులు సైతం పరిహారానికి సంబంధించి తమ వాణి వినిపించాలని భావిస్తున్నారు. కార్యక్రమం సజావుగా సాగేందుకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Palamuru -Ranga Reddy Lift Irrigation
Palamuru -Ranga Reddy Lift Irrigation

By

Published : Aug 10, 2021, 5:11 AM IST

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రెండో దశలో కాల్వల నిర్మాణాలకు సంబంధించి నేడు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. ఇందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నాగర్ కర్నూల్​ జిల్లా వెల్దండ, మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ, నారాయణపేటలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న జలాశయాల నుంచి కాల్వలు తవ్వి ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనుల ప్రారంభంలో పర్యావరణానికి హాని కలుగుతుందని కొందరు న్యాయస్థానాల్లో కేసులు వేశారు. అందువల్ల పనుల్లో జాప్యం జరుగుతుందని వివిధ సందర్భాల్లో ప్రభుత్వం వెల్లడించింది. ఆ పరిస్థితులు తలెత్తకుండా ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నారు.

ప్రజాభిప్రాయ సేకరణ కీలకం..

భూసేకరణకు 27 వేల 185 ఎకరాల భూమి అవసరమని అధికారులు గుర్తించారు. ఇప్పటికే 25 వేల 312 ఎకరాలు సేకరించారు. మరో 1,872 ఎకరాల భూమి అవసరం ఉంది. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉదండాపూర్ జలాశయాల నుంచి వివిధ నియోజకవర్గాలకు సాగునీరు అందించనున్నారు. నారాయణపేట జిల్లాలోని 9 మండలాల్లో లక్షా 60 వేల ఎకరాలు, మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో 22 వేల 219 ఎకరాలు, జడ్చర్లలో లక్షా 36 వేల ఎకరాలు, దేవరకద్రలో 58 వేల 452 ఎకరాలు, అచ్చంపేటలో 2 వేల 357 ఎకరాలు, నాగర్‌కర్నూల్​లో 35 వేల ఎకరాలకు, కల్వకుర్తిలో 63 వేల 144 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. అందులో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణ కీలకం కానుంది.

మద్దతు కోసం కేటీఆర్​ వినతి..

ప్రజాభిప్రాయ సేకరణలో మద్దతు కోసం అధికార పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గత నెల నారాయణపేట పర్యటనలో మంత్రి కేటీఆర్​ సైతం ప్రజాభిప్రాయ సేకరణకు మద్దతు తెలపాలని పాలమూరు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆయకట్టుదారులున్న గ్రామాల ప్రజాప్రతినిధులు... ప్రజలను తీసుకువచ్చేందుకు వాహనాలు సిద్ధం చేశారు. భూ నిర్వాసితులు, ముంపు గ్రామాల ప్రజలు కార్యక్రమానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిర్వాసితుల్లో కొందరికి ఎకరాకు మూడున్నర లక్షల నుంచి ఆరున్నర లక్షల వరకు పరిహారంగా చెల్లించారు. మల్లన్నసాగర్‌లో ఇచ్చినట్లుగా 16 లక్షలు ఇవ్వాలని కోరుతున్నారు.

గోప్యత పాటిస్తున్న అధికారులు..

వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోనూ నేడు ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. అధికారికంగా వివరాలు వెల్లడించడానికి రెవెన్యూ, సాగునీటి పారుదల శాఖలు గోప్యతను పాటిస్తున్నాయి.

ఇదీచూడండి:జల విద్యుత్‌పై కేఆర్ఎంబీ ఆదేశాలను తెలంగాణ పట్టించుకోలేదు: జల్‌శక్తి శాఖ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details