మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర వ్యవసాయ మార్కెట్లో క్వింటా ఉల్లి కనిష్టంగా ధర రూ. 2200 నుంచి రూ.2800 వరకు కొనసాగింది. కొత్త ఉల్లి మార్కెట్కు రావడం వల్ల ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. గత వారం వరకు క్వింటా ఉల్లి రూ. 3500 వరకు కొనసాగగా... ఉల్లి ధర ఒక్కసారిగా రూ. 700 తగ్గి రూ. 2,800 వందలకు పడిపోయింది. మహారాష్ట్ర నుంచి నేరుగా జిల్లా కేంద్రాలకు ఉల్లిని దిగుమతి చేసుకోవడం వల్ల ఉల్లి ధరలకు కాస్త కళ్లెం పడింది. సాధారణ కిరాణ దుకాణాల్లో కిలో ఉల్లి రూ. 35 నుంచి 40లకు విక్రయిస్తున్నారు.
దేవరకద్ర మార్కెట్లో తగ్గిన ఉల్లి ధర - onion
మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర వ్యవసాయ మార్కెట్లో ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టాయి.
తగ్గిన ఉల్లి ధరలు