అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రారంభోత్సవ కార్యక్రమం పురస్కరించుకుని మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన ఓ స్వర్ణకారుడు.. బొటనవేలి గోరు సైజులో బంగారంతో రామ మందిరాన్ని తయారు చేశాడు.
గోరుపై బంగారంతో రామమందిర నిర్మాణం - mahabubanagar news
ఓ స్వర్ణకళకారుడు ... బంగారంతో రామమందిరాన్ని నిర్మించాడు. ఏడుగ్రాముల బంగారంతో రెండు రోజుల వ్వవధిలో తయారు చేశాడు.
గోరుపై బంగారంతో రామమందిర నిర్మాణం
రెండురోజుల్లో తయారు చేసి... తన ప్రతిభను చాటుకున్నాడు. జడ్చర్ల పట్టణానికి చెందిన స్వర్ణకారుడు... సంతోష్ చారి.. అయోధ్యలో రామమందిర నిర్మాణ నమూనా ఏడు గ్రాముల బంగారంతో రెండు రోజుల వ్యవధిలోనే తయారు చేశాడు. తన బొటన వేలిని నిలబెట్టి ప్రదర్శన చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అతన్ని పలువురు ప్రశంసించారు. రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన దేశవ్యాప్తంగా హిందువులు ఆసక్తి నెలకొనగా.. ఇక్కడి స్వర్ణకారుడు ప్రదర్శించిన కళను అందరూ అభినందిస్తున్నారు.