తెలంగాణ

telangana

ETV Bharat / state

కన్నుల పండువగా రాజమూర్​ ఆంజనేయస్వామి రథోత్సవం - Rajamur Anjaneyaswamy Brahmotsavam celebrations in devarakadra

దేవరకద్రమండలంలోని చిన్న రాజమూర్​లో ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువలా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన స్వామి వారి రథోత్సవం ఇవాళ తెల్లవారు జామున నిర్వహించారు. మార్గశిర పౌర్ణమి రోజున జరిగిన వేడుకలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

రాజమూర్​ ఆంజనేయస్వామి రథోత్సవం
రాజమూర్​ ఆంజనేయస్వామి రథోత్సవం

By

Published : Dec 13, 2019, 11:06 AM IST

మహబూబ్​నగర్...నారాయణపేట జిల్లాల సరిహద్దులో వెలిసిన ఆంజనేయుడు రాజమూర్ అయ్యగా దర్శనమిస్తాడు. ఏటా మార్గశిర పౌర్ణమి పురస్కరించుకుని నిర్వహించే స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ప్రధానఘట్టమైన స్వామివారి రథోత్సవం ఇవాళ జరిగింది. ఈ వేడుక చూసేందుకు ఉమ్మడి జిల్లాల నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

నిండు వెన్నెల కాంతుల్లో స్వామి వారి రథోత్సవం కన్నుల పండువగా సాగింది. భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పౌర్ణమి సందర్భంగా సుమారు లక్షమంది పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

రాజమూర్​ ఆంజనేయస్వామి రథోత్సవం

ఇదీ చూడండి: ఫోను పక్కనుంటే.. పలకరింపే కరువాయే!

ABOUT THE AUTHOR

...view details