మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర రైల్వేస్టేషన్ సమీపంలో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ శంకరపల్లికి చెందిన రైల్వేకాంట్రాక్టర్ వెంకట్రెడ్డి(50) దేవరకదర్ర రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలపై తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. కాంట్రాక్టర్ ఆత్మహత్య విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
రైలు కింద పడి రైల్వే కాంట్రాక్టర్ ఆత్మహత్య - అధికారుల ఒత్తిడికి రైల్వే కాంట్రాక్టర్ బలి
అధికారుల ఒత్తిడి వల్ల ఓ రైల్వే కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలపై తలపెట్టి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
RAILWAY CONTRACTOR SUICIDE AT DHEVARAKDRA RAILWAY STATION
ఆత్మహత్యకు రైల్వే అధికారులు ఒత్తిడే కారణమన్న ఆరోపణలు వస్తున్నాయి. జక్లేర్ రైల్వేస్టేషన్ నుంచి కృష్ణ రైల్వే స్టేషన్ మధ్య జరుగుతున్న విస్తరణ పనులను శుక్రవారం రోజున రైల్వే అధికారులు పరిశీలించారు. ఈ క్రమంలోనే కాంట్రాక్టర్లు అధికారులు మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది.