Rahul Gandhi in Vijayabheri bus Yatra at Jadcherla : దేశంలో, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఓబీసీ జనగణన(OBC Sensus in India)కు తొలి ప్రాధాన్యం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఓబీసీల శక్తి ఏంటో తెలుస్తుందన్న కారణంతోనే జనగణనకు బీజేపీ, బీఆర్ఎస్ అంగీకరించడం లేదని విమర్శలు చేశారు. జడ్చర్లలో జరిగిన కాంగ్రెస్ విజయభేరి బస్సు యాత్ర(Congress Bus Yatra in Telangana)లో రాహుల్ పాల్గొని.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
దేశాన్ని నడిపించడంలో ఓబీసీల పాత్ర ఎంతో ఉందని రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో బీసీలు, ఆదివాసీలు, దళితులు ఎంతమంది ఉన్నారంటే ఎవరూ చెప్పలేరని తెలిపారు. దేశాన్ని రాజ్యసభ, లోక్సభ సభ్యులు నడపరని.. పాలన మొత్తాన్ని 90 మంది ఐఏఎస్ అధికారులు మాత్రమే నడుపుతున్నారన్నారు. ఏ శాఖకు ఎన్ని నిధులివ్వాలన్నది వాళ్లే నిర్ణయిస్తారని వివరించారు.
Rahul Gandhi Wants to Do OBC Sensus in India : ఆ 90 మందిలో ఓబీసీలు, దళితులు ఎంత మంది ఉన్నారని ప్రశ్నించారు. దేశాన్ని నడపడంలో బీసీ, దళితులు, ఆదివాసీల భాగస్వామ్యం లేదా అంటూ ప్రశ్నించారు. ఆ 90 మందిలో ఓబీసీ అధికారులు కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారని.. 5 శాతం బడ్జెట్ మాత్రమే బీసీలకు కేటాయిస్తున్నారని విమర్శించారు. అందుకే బీసీల జనగణన జరగాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.