శ్వాసపై ఏకాగ్రతే సర్వరోగ నివారిణిగా పనిచేస్తుందని ధ్యాన ప్రచారకులు బ్రహ్మర్షి పత్రీజీ పేర్కొన్నారు. మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలో ఏర్పాటు చేసిన పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ధ్యానులను ఉద్దేశించి మాట్లాడారు. ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.
ధ్యానమే సర్వరోగ నివారిణి: బ్రహ్మర్షి పత్రీజీ - మహబూబ్నగర్ వార్తలు
మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం నెల్లికొండి గ్రామంలో ఏర్పాటు చేసిన పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని.. ధ్యాన ప్రచారకులు బ్రహ్మర్షి పత్రీజీ ప్రారంభించారు. అనంతరం ధ్యానులను ఉద్దేశించి మాట్లాడారు.
'ధ్యానంతోనే మనశ్శాంతి'
నిత్య ధ్యాన సాధన వల్ల జ్ఞాపక శక్తితో పాటు, మనశ్శాంతి, ఆయుష్షు పెరుగుతుందని బ్రహ్మర్షి పత్రీజీ సూచించారు. తోటి వారితో కలసి ధ్యానం చేశారు.
ఇదీ చదవండి:మానసిక ఆరోగ్యాన్ని పెంచుకునేందుకు ధ్యానం ఎంతో ఉపయోగం: బ్రహ్మకుమారీలు