తెలంగాణ

telangana

ETV Bharat / state

'పదోన్నతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది' - Mahbubnagar district latest news

ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని... పీఆర్టీయూ మహబూబ్​నగర్​ జిల్లా అధ్యక్షుడు నారాయణ అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు 45 శాతం ఫిట్​మెంట్​తో పీఆర్సీ వర్తింప జేయాలని డిమాండ్​ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ... జిల్లా కేంద్రంలో ధర్నా చేపట్టారు.

PRTU Dharna in Mahbubnagar district
పదోన్నతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది

By

Published : Feb 9, 2021, 7:07 PM IST

ఏళ్ల తరబడి పెండింగ్​లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని... పీఆర్టీయూ మహబూబ్​నగర్​ జిల్లా అధ్యక్షుడు నారాయణ తెలిపారు. ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ధర్నా చేపట్టారు. 2018 నుంచి ఇప్పటి వరకు పీఆర్సీ ప్రకటించలేదని, వెంటనే 11వ పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు.

ఉద్యోగ, ఉపాధ్యాయులకు 45 శాతం ఫిట్​మెంట్​తో పీఆర్సీ వర్తింప జేయాలని డిమాండ్​ చేశారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని అన్నారు. ఉద్యోగ భద్రత కల్పిస్తూ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన పదోన్నతుల షెడ్యూల్ ప్రకటించి అర్హులైన ఉపాధ్యాయులందరికి పదోన్నతులు కల్పించాలని కోరారు.

ఇదీ చదవండి: స్థలం కబ్జా అయిందని 70 ఏళ్ల బామ్మ ఆందోళన

ABOUT THE AUTHOR

...view details