నేను మీ చౌకీదార్... మీ ఆశీర్వాదం కోసం ఇక్కడికి వచ్చాను... అంటూ పాలమూరుబహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసగించారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలన చూశారు... 60 నెలల చౌకీదార్ పాలన కూడా చూశారు ఎవరికీ ఓటేయాలో మీరే నిర్ణయించుకోవాలని సూచించారు. మరోసారి అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజల కలలను సాకారం చేస్తానన్నారు. మీ ఆశీర్వాదంతోనే ఐదేళ్లపాటు ప్రధానిగా సేవలు అందించానని.. మరోసారి ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.
మీ ఆశీర్వాదమే నన్ను కాపాడింది: మోదీ - BJP MEET
మరోసారి మీ ఆశీర్వాదం పొందేందుకు మీ ముందుకొచ్చానని ప్రధాని నరేంద్ర మోదీ పాలమూరులో జరిగిన బహిరంగ సభలో అన్నారు. తిరిగి తనకి అవకాశమిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజల కలలు సాకారం చేస్తానని పేర్కొన్నారు.
![మీ ఆశీర్వాదమే నన్ను కాపాడింది: మోదీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2841183-837-e289278b-a9e9-4e97-9834-ccb4a7616ba1.jpg)
మీ ఆశీర్వాదమే నన్ను కాపాడింది: మోదీ