తెలంగాణ

telangana

ETV Bharat / state

కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి ధరలు - In the Mahabubnagar district, onion prices have once again increased in the Devarakadra agricultural market

ఉల్లి ధరలు వినియోగదారులకు కోయకుండానే కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఉల్లి పేరు ఎత్తితేనే అమ్మో అంటున్నారు.

కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి ధరలు

By

Published : Oct 16, 2019, 4:01 PM IST

మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర వ్యవసాయ మార్కెట్​లో మరోమారు ఉల్లి ధరలు పెరిగాయి. ఉల్లిని అత్యధికంగా సాగు చేసే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో అధిక వర్షాలతో ఇన్నాళ్లు ధర పెరిగిన విషయం వాస్తవమే. గత 15 రోజులుగా కొత్త ఉల్లి రావడం వల్ల ఉల్లి ధరలు నిలకడగా కొనసాగాయి. తిరిగి అక్కడక్కడ కురుస్తున్న వర్షాలతో ఉల్లి ధరలకు మరోసారి రెక్కలు వచ్చాయి. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర వ్యవసాయ మార్కెట్లో క్వింటా ఉల్లి ధర కనిష్ఠంగా రూ.2400 నుంచి గరిష్ఠంగా రూ. 3170 వరకు పలికింది.

కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి ధరలు

ABOUT THE AUTHOR

...view details