హైదరాబాద్ నుంచి కర్నూల్ వెళ్తున్న కోళ్ల వాహనం మానవపాడు మండలం బోరవెల్లి దగ్గర జాతీయ రహదారిపై అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్, క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే ఉన్న కొంతమంది అంబులెన్స్‌లో వారిని ఆస్పత్రికి తరలించారు.
కోళ్ల వాహనం బోల్తా.. లూటీ చేసిన జనం! - కోళ్ల వాహనం బోల్తా.. లూటీ చేసిన జనం!
అదుపు తప్పి కోళ్ల వాహనం బోల్తా పడగా.. సమీప గ్రామస్థులు లూటీ చేసిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి కర్నూల్ వెళ్తున్న కోళ్ల వాహనం మానవపాడు సమీపంలో జాతీయ రహదారిపై బోల్తా పడింది.
కోళ్ల వాహనం బోల్తా.. లూటీ చేసిన జనం!
బోల్తా పడిన వాహనం దగ్గర ఎవరూ లేకపోవడం వల్ల రహదారి గుండా వెళ్లేవారు, సమీప గ్రామాల ప్రజలు కోళ్ల వాహనంలో ఉన్న కోళ్లను లూటీ చేశారు. సుమారు 1000 నుంచి 1500 కోళ్ల వరకు ఎత్తుకెళ్లినట్టు సమాచారం.
ఇదీ చూడండి :ప్రతిధ్వని: స్కూళ్లు తెరుచుకుంటాయా.. తరగతుల నిర్వహణ సాధ్యమేనా?
TAGGED:
Mahabub Nagar News