NGT on Palamuru- Rangareddy Project: పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు పర్యావరణ అనుమతులకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై విచారణను జాతీయ హరిత ట్రిబ్యునల్ మరోసారి వాయిదా వేసింది. కోస్గి వెంకటయ్య, డి.చంద్రమౌళీశ్వర రెడ్డితో పాటు ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్లపై... జస్టిస్ రామకృష్ణన్, విషయ నిపుణుడు సత్యగోపాల్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కృష్ణా బోర్డు అందించిన వాస్తవ నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం.. సవివరంగా ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 25కు వాయిదా వేసింది.
అఫిడవిట్ దాఖలు