తపాలా బ్యాంకు సేవల్లో వనపర్తి డివిజన్ దేశంలోనే ఇతర డివిజన్ల కంటే మంచి ఫలితాలు సాధించడం గర్వించదగ్గ పరిణామమని పోస్ట్మాస్టర్ జనరల్ సంధ్యారాణి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని గ్రామీణ పోస్ట్మాస్టర్లతో తపాలాశాఖ అమలు చేస్తున్న పథకాలపై సదస్సు నిర్వహించారు.
'తపాలా శాఖ అమలు చేసే పథకాలు ప్రజలకు చేరువ కావాలి' - మహబూబ్నగర్ తాజా వార్త
తపాలా కార్యాలయాల ద్వారా మంచి సేవలు అందించి దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ తపాలాశాఖ సేవల్లో అగ్రగామిగా నిలవాలని ఆ శాఖ రాష్ట్ర చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ సంధ్యారాణి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో గ్రామీణ పోస్ట్మాస్టర్లతో తపాలాశాఖ అమలు చేస్తున్న పథకాలపై సదస్సును నిర్వహించారు.
!['తపాలా శాఖ అమలు చేసే పథకాలు ప్రజలకు చేరువ కావాలి' postal department meeting in mahabubnagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6055035-195-6055035-1581568086739.jpg)
'తపాలశాఖ అమలు చేసే పథకాలు ప్రజలకు చేరువకావాలి'
తపాలాశాఖ అమలు చేసే పథకాలు ప్రజలకు చేరువ కావాలని ఆమె ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విధుల్లో ప్రతిభ కనబరచిన తపాలా శాఖ సిబ్బందిని అధికారులు పురస్కారాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పోస్ట్మాస్టర్ జనరల్ హనుమాన్ సింగ్, వనపర్తి డివిజన్ పర్యవేక్షకులు శ్రీనివాస్, ఏఎస్పీ భూమయ్య తదితరులు పాల్గొన్నారు.
'తపాలశాఖ అమలు చేసే పథకాలు ప్రజలకు చేరువకావాలి'
ఇదీ చూడండి: 'వాళ్లు లంచాలు ఇస్తే వీళ్లు అనుమతి పత్రాలు ఇస్తారు'