మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పురపాలికలో 27వార్డులకు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి ఓటేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. 54 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల వరకు 23 శాతం పోలింగ్ నమోదైంది. బరిలో 112 మంది అభ్యర్థులు ఉన్నారు.
జడ్చర్లలో 11 గంటల వరకు 23 శాతం పోలింగ్ - జడ్చర్లలో పోలింగ్
జడ్చర్ల పురపాలికలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. జడ్చర్లలో ఉదయం 11 గంటల వరకు 23 శాతం పోలింగ్ నమోదైంది.
jadcharla polling
కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు పటిష్ఠ చర్యలు తీసుకున్నారు. ఓటు వేసేందుకు వచ్చే వారంతా మాస్కుధరించాలని సూచించారు. దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఇదీ చూడండి:ఖమ్మం కార్పొరేషన్‌లో కొనసాగుతున్న పోలింగ్
Last Updated : Apr 30, 2021, 11:50 AM IST