Political War in Mahabubnagar ఉత్కంఠ రేపుతున్న ఉమ్మడి పాలమూరు రాజకీయాలు.. అలంపూర్‌లో బీఆర్ఎస్ ప్లాన్ ఏంటి..? Political War in Mahabubnagar :ఉమ్మడి పాలమూరు(Palamuru Politics) జిల్లా రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారాయి. జిల్లాలో అన్ని పార్టీల కన్నా ముందుగా బీఆర్ఎస్ 14 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి బీ-ఫారాలు సైతం ఇచ్చారు. బీఆర్‌ఎస్ అలంపూర్ అభ్యర్థిగా ప్రకటించిన అబ్రహంకు.. మాత్రం ఇప్పటికీ బీ-ఫారం ఇవ్వలేదు. అక్కడ అబ్రహం అభ్యర్థిత్వంపై సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో అభ్యర్థిని మార్చుతారా.. అబ్రహంనే కొనసాగిస్తారా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది.
Ticket War in Congress Party Mahabubnagar : ఉమ్మడి పాలమూరు కాంగ్రెస్‌లో టికెట్ల రగడ.. హస్తం పార్టీకి అసంతృప్త నేతల తిరుగుబావుట
Alampur Constituency BRS B-form Issue :14 స్థానాల్లో 8 స్థానాలకే అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్.. మిగిలిన 6 స్థానాల్లో అభ్యర్ధులను తేల్చలేదు. మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర, వనపర్తి, నారాయణపేట, మక్తల్ అభ్యర్ధులను ప్రకటించలేదు. ఎవరికి టిక్కెట్టు దక్కుతుందోనని ఆశావహులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరికొందరు టిక్కెట్ దక్కకపోతే భవిష్యత్ ఏంటన్న డైలమాలో ఉన్నారు. ఆరు చోట్ల ఇద్దరు, ముగ్గురు టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో మూడు స్థానాలుంటే ఒకటి బీసీ లేదా మైనారిటీలకు, నారాయణపేట ఒకటి రెడ్డి, ఒకటి బీసీలకు కేటాయించాలనే డిమాండ్లున్నాయి. వనపర్తిలో సీనియర్ నాయకులు, ఇటీవలే పార్టీలో చేరిన వాళ్ల మధ్య పోటీ నడుస్తోంది. అవకాశం దక్కేదెవరికన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో.. రెండో జాబితాలోనైనా తమ పేరు వస్తుందేమోనని ఎదురుచూస్తున్నారు.
BRS Leaders Fires on PM Modi : 'తెలంగాణకు ప్రధాని మోదీ కొత్తగా ఇచ్చిందేంటి..?'
Palamuru District Political News : ఉమ్మడి పాలమూరు జిల్లా 14 స్థానాల్లో రెండింటికే అభ్యర్ధుల్ని ప్రకటించిన బీజేపీ.. మిగిలిన స్థానాలపై ఉత్కంఠకు తెరదించలేదు. కొల్లాపూర్‌లో ఎల్లేని సుధాకర్‌రావుకు, కల్వకుర్తిలో ఆచారికి మాత్రమే ఇప్పటి వరకూ అధిష్ఠానం టిక్కెట్టు ఖరారు చేసింది. మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాద్యక్షురాలు సొంత నియోజక వర్గాలైన మహబూబ్‌నగర్, గద్వాల స్థానాలకు మొదటి జాబితాలో అభ్యర్ధులను ప్రకటించకపోవడంపై సందేహాలు వెల్లువెత్తున్నాయి.
మిగిలిన 10 నియోజక వర్గాల్లో.. ఇద్దరు అంతకంటే ఎక్కువమంది టిక్కెట్ ఆశిస్తున్నారు. కాగా గద్వాల, మహబూబ్‌నగర్‌లో బీసీవాదం ఊపందుకోవడంతో కొత్తవారిని బరిలోకి దించుతారా అన్న సందేహాలు వెల్లువెత్తున్నాయి. వీలైనంతా త్వరగా అభ్యర్థులను ప్రకటించి.. ప్రచారం ముమ్మరం చేయాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తోంది.
మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో తమకు టిక్కెట్టు వస్తుందా..? రాదా..? అని ఆశావహులు, తమ ప్రత్యర్థులెవరో తేలక టిక్కెట్టు ఖరారైన వాళ్లు, టికెట్టు దక్కెదెవరికని రాజకీయ పార్టీలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా.. ఇప్పటికీ ప్రధాన పార్టీల నుంచి బరిలో నిలిచేదెవరో తేలక..పాలమూరు జిల్లా రాజకీయాల్లో ఉత్కంఠను రేపుతున్నాయి.
Mahabubnagar BRS Leaders Joining in Congress : పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్కు షాక్.. కాంగ్రెస్‌లో భారీ చేరికలు