కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు పాలమూరు జిల్లాలో పోలీసులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే జిల్లాలో 11 పాజిటివ్ కేసులు నమోదు కాగా... సంబంధిత కాలనీలను రెడ్జోన్లుగా ప్రకటించారు. ఈ కాలనీల్లో నుంచి ప్రజలు బయటకు రాకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇళ్ల వద్దకే నిత్యావసర సరుకులు అందజేస్తున్నారు.
పాలమూరులో పోలీసుల పటిష్ఠ బందోబస్తు - corona effect in mahabubnagar
సర్కార్ ఆదేశాల మేరకు మహబూబ్నగర్ జిల్లాలో లాక్డౌన్ను మరింత కఠినం చేశారు. నిషేధిత ప్రాంతాల నుంచి ప్రజలు బయటకు రాకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

పాలమూరులో పోలీసుల పటిష్ఠ బందోబస్తు
నిషేధిత ప్రాంతాల్లో బారికేడ్లు తొలగించి వీధుల్లో తిరుగుతున్న వారిని పోలీసులు గుర్తించారు. ప్రజలెవరూ బయట తిరగకుండా 8 అడుగుల ఎత్తు బారికేడ్లు ఏర్పాటు చేశారు. లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేసేందుకు డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు.