మత్తు పదార్థాల అక్రమ రవాణాపై మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో నాలుగు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ప్రత్యేక పోలీసులు బలగాల ద్వారా వాహన తనిఖీలు చేపడుతున్నారు. జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్‌తో పాటు కోయంబత్తూర్ నుంచి దిల్లీ వెళ్తున్న కొంగు ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీలు నిర్వహించారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడిన యువత తరచూ నేరాలకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటుండడంతో... వాటిని అరికట్టడానికి అనుక్షణం పర్యవేక్షిస్తున్నామని డీఎస్పీ కిషన్ తెలిపారు.
దసరా ఉత్సవాల సందర్భంగా రాకపోకలు పెరగడంతో ఇతర ప్రాంతాల నుంచి జిల్లాలోకి మత్తు పదార్థాలు రాకుండా నియంత్రణ చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఇటు ఆంధ్రా, అటు కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి మహబూబ్‌నగర్ జిల్లాకు మత్తు పదార్థాలు రావాణా అయ్యే అవకాశం ఎక్కువగా ఉండటంతో వాహనాలను, రైళ్లను తనిఖీ చేస్తున్నామని తెలిపారు.
మారుమూల ప్రాంతాల్లో సైతం గంజాయి పట్టుపబడుతుండటంతో జిల్లా కేంద్రంలో రద్దీగా ఉండే బస్టాండ్, రైతు బజారు తదితర ప్రాంతాల్లో తనిఖీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీనికి తోడు పట్టణంలో నిర్భంద తనిఖీలు చేపట్టామని తెలిపారు. అనుమానంగా ఉంటున్న వ్యక్తులపై నిఘా పెట్టడంతో పాటు అక్రమ వాహానాల వివరాలు సేకరిస్తున్నామని డీఎస్పీ కిషన్ పేర్కొన్నారు.
మాదకద్రవ్యాలకు అలవాటు పడిన యువత తరచూ నేరాలకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటుండడంతో వాటిని అరికట్టడానికి తనిఖీలు చేపట్టాము. పై అధికారుల సూచనలతో జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్‌తో పాటు కోయంబత్తూర్ నుంచి దిల్లీ వెళ్తున్న కొంగు ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీలు నిర్వహించాము. దసరా ఉత్సవాల సందర్భంగా రాకపోకలు పెరగడంతో ఇతర ప్రాంతాల నుంచి జిల్లాలోకి మత్తు పదార్థాలు రాకుండా నియంత్రణ చర్యలు చేపట్టడం కోసం నాలుగు చెక్‌పోస్టుల ఏర్పాటు చేశాము. - కిషన్, మహబూబ్‌నగర్ డీఎస్పీ
మత్తు పదార్థాల అక్రమ రవాణాపై పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసిన మహబూబ్‌నగర్ పోలీసులు ఇదీ చదవండి:లక్కీ ఛాన్స్.. అక్కడ టీకా వేసుకుంటే వంటనూనె, ఫోన్లు!