మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని కావేరమ్మ పేటలో కొందరు గోవధను నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లి విచారించారు. నిబంధనలు అతిక్రమించి గోవధ చేస్తున్నట్లు గుర్తించామని సీఐ వీరస్వామి, ఎస్సై జయ ప్రసాద్ తెలిపారు. ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అక్కడ లభించిన 34 పశువులను గొల్లపల్లిలోని గో సంరక్షణాలయానికి తరలించారు.
గోవధకు పాల్పడిన ఆరుగురిపై కేసు నమోదు - జడ్చర్ల తాజా వార్తలు
నిబంధనలు అతిక్రమించి గోవధకు పాల్పడిన ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో పోలీసులకు అందిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకుని 34 పశువులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గో సంరక్షణ కేంద్రానికి తరలించారు. గోవధ నిషేధం అమలును అతిక్రమించిన వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
గోవధకు పాల్పడిన ఆరుగురిపై కేసు నమోదు
గోవధ నిషేధం అమలును అతిక్రమించిన వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ప్రభుత్వం ఈ విషయంలో ఇప్పటికే హెచ్చరించిన కొందరు ఇలాంటి ఘటనలకు పాల్పడడం తగదని సూచించారు.
ఇవీ చూడండి: తల్లి పాలు శిశువులకు ఎంతో ఆరోగ్యకరం: గవర్నర్ తమిళిసై