తెలంగాణ

telangana

ETV Bharat / state

SEZ Kabza: సెజ్‌లో భూబకాసురులు.. కోట్ల విలువైన స్థలాలపై అక్రమార్కుల కన్ను - Polepally sez lands news

SEZ Kabza: హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పోలేపల్లి పారిశ్రామికవాడలో భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. పారిశ్రామికవాడకు సంబంధించిన భూములకు సరిహద్దులు సక్రమంగా లేకపోవడంతో స్థిరాస్తి వ్యాపారులకు వరంగా మారుతోంది. కొంచెం కొంచెం ఈ భూములను ఆక్రమించుకోవడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ పారిశ్రామికవాడలో సుమారు 10 ఎకరాల భూములపై అక్రమార్కుల కన్నుపడింది.

SEZ
SEZ

By

Published : Mar 6, 2022, 5:10 AM IST

Updated : Mar 6, 2022, 6:30 AM IST

సెజ్‌లో భూబకాసురులు.. కోట్ల విలువైన స్థలాలపై అక్రమార్కుల కన్ను

SEZ Kabza: మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల పోలేపల్లి శివారులో గ్రీన్‌ ఇండస్ట్రీయల్‌ పార్క్‌ కోసం 2003లో దాదాపు వెయ్యి ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. 645 ఎకరాలు పట్టా భూమికాగా, 309 ఎకరాల అసైన్డు. భూనిర్వాసితులకు 2005లోనే పరిహారం అందించారు. 2007 నుంచి పలు పరిశ్రమలు రాగా... ప్రస్తుతం 32కి చేరాయి. కర్మాగారాలకు కేటాయించగా మిగిలిన భూములను అలాగే వదిలేశారు. కనీసం హద్దులు, ప్రహారిగోడ లేకపోవడం అక్రమార్కులకు అనుకూలంగా మారింది. మాచారం నుంచి పోలేపల్లికి వేళ్లే రోడ్డులో పారిశ్రామికవాడ భూములున్నాయి. వీటిని ఆనుకునే ఉన్న ప్రైవేటు భూముల్లో కొందరు వెంచర్లు వేస్తున్నారు. ఈ వెంచర్ల కోసం రోడ్డుకు ఆనుకోని ఉన్న పారిశ్రామికవాడ భూములను కబ్జా చేసి దర్జాగా రోడ్డు వేసుకున్నారు. ఎలాంటి అనుమతుల్లేకుండానే రహదారి పేరుతో కబ్జా చేయడానికి తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఆక్రమణలకు గురి...

పారిశ్రామికవాడలోనే ఉన్న కుమ్మరికుంట చెరువు ఆక్రమణలకు గురవుతోంది. క్షేత్రస్థాయిలో ఎకరా పరిధిలోనే చిన్న కుంటగా కనపడుతోంది. ఓ స్థిరాస్తి వ్యాపారి తన భూమితో పాటు కుమ్మరికుంటకు చెందిన భూమిని కలుపుకుని వెంచర్లు వేయడానికి సిద్ధమయినట్లు సమాచారం. పారిశ్రామికవాడకు చెందిన హద్దులు లేకపోవడంతో కోట్ల విలువైన స్థలాలు ఆక్రమణల చెరలో చిక్కుకుంటున్నాయి. కొంచెం కొంచెం మట్టిని పోస్తూ కుమ్మరికుంటను పూడ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయా ప్రభుత్వశాఖలకు చెందిన అధికారుల మధ్య సమన్వయలోపం ఆక్రమణదారులకు కలిసొస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

భూములు అన్యాక్రాంతం...

పోలేపల్లి పారిశ్రామికవాడకు సంబంధించిన భూములు అన్యాక్రాంతమయ్యే అవకాశాలున్నాయని 2009లోనే అప్పటి జిల్లా కలెక్టర్‌కు జడ్చర్ల తహసీల్దారు సలాం లేఖ రాసినా ఇంతవరకు చర్యలు చేపట్టలేదు. సరిహద్దు గోడను ఏర్పాటు చేయకపోతే ప్రైవేటు వ్యక్తులు సెజ్‌ భూములను ఆక్రమించుకునే అవకాశం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఇదీ చూడండి:

Last Updated : Mar 6, 2022, 6:30 AM IST

ABOUT THE AUTHOR

...view details