PM Modi Telangana Tour Schedule అక్టోబర్ 1న తెలంగాణకు ప్రధాని మోదీ PM Modi Telangana Tour Schedule :ఇప్పటికే ఖరారైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. బేగంపేట విమానాశ్రయం రాకుండా శంషాబాద్ అంతర్జాతీయ విమనాశ్రయానికి ప్రత్యేక విమానంలో అక్టోబర్ 1వ తేదీన మధ్యాహ్నం 1:30 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్‌లో మహబూబ్‌నగర్‌కు బయలుదేరి వెళ్లనున్నారు.
BJP Public Meetings in October : అలా మధ్యాహ్నం 2:05 గంటలకు మహబూబ్‌నగర్‌కు చేరుకుని 2:15 నుంచి 2:50 వరకు పలు అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం పక్కనే ఉన్న బహిరంగ సభా స్థలికి మధ్యాహ్నం 3 గంటలకు చేరుకోనున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమరభేరీ సభలో పాల్గొని.. ఈ సభావేదిక నుంచే ఎన్నికల శంఖారావాన్ని మోదీ పూరించనున్నారు.
ఆ సభలో కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యవహార శైలిపై ధ్వజమెత్తనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. సాయంత్రం 4 గంటలకు సభ ముగించుకుని హెలికాప్టర్‌లో శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం 4.45 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి తిరిగి దిల్లీ పయనం కానున్నారు. అనంతరం కేంద్రహోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వంటి జాతీయ నాయకులు తెలంగాణ పర్యటనకు రానున్నారు. బస్సు యాత్ర స్థానంలో ఇలా అసెంబ్లీ సెగ్మెంట్ల వద్ద జాతీయ నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు.
Telangana BJP Leaders Secret Meeting : 'ఎరక్కపోయే వచ్చి బీజేపీలో ఇరుక్కుపోయామే.. ఇప్పుడేం చేసేది.. ఎటువెళ్లేది..?'
PM Modi Inaugurated Kacheguda Yeswantapur Vande Bharat Train : 'బీజేపీ ప్రభుత్వం.. రైల్వేలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది'
Telangana BJP Election Plan 2023 :మరోవైపు ప్రధాని సభలకు భారీ జన సమీకరణపై పార్టీ నాయకత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా మహిళా బిల్లు ఆమోదం నేపథ్యంలో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఆయా నియోజకవర్గ నాయకులకు బాధ్యతలు అప్పగించారు. నిజామాబాద్ సభ ఏర్పాట్లను కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) స్వయంగా పరిశీలిస్తుండగా.., మహబూబ్‌నగర్‌లో ఏర్పాట్లను రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పర్యవేక్షిస్తున్నారు. మోదీ పర్యటన తెలంగాణ రాజకీయాలను దిశానిర్దేశం చేస్తుంది కిషన్‌రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.
"నిజామాబాద్ సభతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు ప్రధాని నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేస్తారు. పాలమూరులో అక్టోబరు 1న జరిగే సభ కీలక పాత్ర పోషిస్తుంది. ఆక్టోబర్ 1 నుంచే బీజేపీ ఎన్నికల ప్రచారం మొదలు కానుంది." - కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
PM Modi Telangana Tour :ప్రధాని పర్యటన తర్వాత బీజేపీ అగ్రనేత అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు కేంద్ర మంత్రులు, ఇతర జాతీయ నాయకుల సభలు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. గతంలో చేపట్టాలనుకున్న బస్సు యాత్ర స్థానంలో వీటిని నిర్వహించాలని నిర్ణయించారు.
Kishan Reddy on PM Modi Telangana Tour : 'నిజామాబాద్ సభలోనే తెలంగాణలో మోదీ ఎన్నికల శంఖారావం'
BJP rally on Approve Women Reservation Bill : 'మహిళా రిజర్వేషన్‌పై విపక్షాలు 75 ఏళ్లుగా ఆలోచిస్తూనే ఉన్నాయి'