ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సుమారు 20వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరైతే... ఇప్పటి వరకూ లబ్ధిదారులకు అప్పగించినవి.. కేవలం 330 మాత్రమే. మిగిలిన ఇళ్లు ఎప్పటికి పూర్తవుతాయో... ఎవరికి దక్కుతాయో తెలియని దుస్థితి.
నిధులు లేవని కొన్నిచోట్ల, స్థలాలు దొరక్క కొన్నిచోట్ల, కాంట్రాక్టర్లు ముందుకు రాక ఇంకొన్ని చోట్ల... ఇలా కారణాలు ఏవైతేనేం.. రెండు పడక గదుల ఇళ్ల కోసం నిరుపేద జనం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.
ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలకు కలిపి 9 వేల 684 ఇళ్లు, నాగర్ కర్నూల్ జిల్లాలో 4 వేల 8 వందల ఇళ్లు, జోగులాంబ గద్వాలలో 2 వేల 7 వందల ఇళ్లు, వనపర్తిలో 2 వేల 4 వందల ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో మహబూబ్‌నగర్‌లోని ఆదర్శ నగర్లో 310, నిజలాపూర్‌లో 20 ఇళ్లు మాత్రమే లబ్ధిదారులకు అప్పగించారు. మిగిలినవి ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాలుగేళ్లుగా ఎదురుచూపులు...
నాగర్‌కర్నూల్‌లో 398 ఇళ్లు మంజూరైనప్పటికీ... నాలుగేళ్లుగా అవి నిర్మాణ దశలోనే ఉన్నాయని జిల్లా వాసులు వాపోతున్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వలేదని... అద్దె ఇళ్లలో ఉంటూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు.
బైట్: గీత
నత్తనడకన పనులు...
ఆరేళ్ల క్రితం పనులు ప్రారంభించినా... నేటికీ వాటి పనులు నత్త నడకన సాగుతున్నాయని లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
నారాయణపేట జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. 2018 సంవత్సరంలోనే 4 వందల ఇళ్ల నిర్మాణాలు చేపట్టినా అవి ఇంకా పూర్తి కాలేదు. రెండేళ్లుగా కేవలం పిల్లర్ల పని మాత్రమే ముగించి మిగిలిన పనులను నత్త నడకన సాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
6 నెలల్లో అందిస్తాం...
మరోవైపు నారాయణపేట జిల్లాలో మంజూరైన 4 వందల ఇళ్లలో మొత్తం 50 బ్లాకులు ఉన్నాయని పంచాయతీరాజ్ ఈఈ నాగరాజు తెలిపారు. ఇప్పటికే 12 బ్లాకులు ప్రారంభమయ్యాయని... మిగిలిన బ్లాకుల పనులు కొనసాగుతున్నాయన్నారు. మరో 6 నెలల్లో అన్ని పనులు పూర్తి చేసి ఇళ్లను ప్రజలకు అందిస్తామన్నారు.
బైట్ నాగరాజు, పంచాయతీరాజ్ ఈఈ
నిబంధనలు మారిస్తే తప్ప...
ప్రభుత్వం నిర్ధేశించుకున్న లక్ష్యం నెరవేరాలంటే రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి కేటాయించిన రూ.5 లక్షల నిధుల్ని నేరుగా లబ్ధిదారుని ఖాతాకు జమచేస్తే నిర్మాణాలు త్వరగా జరిగే అవకాశం ఉంది. స్థలాల కొరతను అధిగమించేందుకు సొంత స్థలాలున్న నిరుపేద కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేయాలన్న డిమాండ్ సైతం వినిపిస్తోంది. నిబంధనల్లో మార్పులు చేస్తూ.. పనుల్లో వేగం పెంచితే తప్ప రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాల లక్ష్యం నెరవేరేలా కనిపించడం లేదు.
కలగానే... పేదోడి రెండు పడకల ఇళ్లు..! ఇదీ చూడండి: దిశ కేసులో కీలక ఆధారాలు.. సూపర్ లైట్‌తో గుర్తింపు