తెలంగాణ

telangana

ETV Bharat / state

ముఖ్యమంత్రి ఆదేశాలు బేఖాతరు చేసిన పాలమూరు వాసులు - మహబూబ్​నగర్​ జిల్లాలో కరోనా ప్రభావం

ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రకటించిన లాక్​డౌన్​ను బేఖాతరు చేస్తూ మహబూబ్​నగర్​ జిల్లాలో పలువురు తమ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. తమ స్వస్థలానికి వెళ్లడానికి నేడు బస్టాండ్​కు వచ్చిన దిల్లీకి చెందిన 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

people are violating chief minister kcr's rules
ముఖ్యమంత్రి ఆదేశాలు బేఖాతరు చేసిన పాలమూరు వాసులు

By

Published : Mar 23, 2020, 2:45 PM IST

ముఖ్యమంత్రి ఆదేశాలు బేఖాతరు చేసిన పాలమూరు వాసులు

మహబూబ్​నగర్​ జిల్లాలో రెండోరోజు ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రజలు నిత్యావసర సరుకులు, కూరగాయలు కొనేందుకు రోడ్లపైకి రావడం వల్ల పరిమితికి మించి వాహనాలు తిరుగుతున్నాయి.

ప్రజా రవాణా వ్యవస్థలైన ఆటోలు, ప్రైవేటు వాహనాలు తిరగకూడదని ఆదేశాలున్నా.. వాటిని బేఖాతరు చేస్తూ పలువురు రహదారులపైకి వస్తున్నారు.

వ్యక్తిగత పని నిమిత్తం దిల్లీకి చెందిన పది మంది మహబూబ్​నగర్​కు వచ్చారు. లాక్​డౌన్​ ప్రకటించడం వల్ల తమ స్వస్థలానికి వెళ్లడానికి జిల్లా కేంద్రంలోని బస్టాండ్​కు వచ్చిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్యపరీక్షల నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details