లాక్డౌన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇవ్వడం వల్ల ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రోడ్లపై జనం రద్దీ మరింత పెరిగింది. పాలు, పండ్లు, కూరగాయలు, ఔషధ దుకాణాలతో పాటు ప్రభుత్వం ఇచ్చిన సడలింపుల మేరకు అన్ని దుకాణాలు తెరిచారు. పట్టణాల్లో 50 శాతం మాత్రమే దుకాణాలు తెరవాలన్న ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఒక్కో దుకాణానికి ఒక్కో నెంబర్ కేటాయించి బేసి, సరి సంఖ్యల ఆధారంగా దుకాణాలు తెరిచేలా రంగం సిద్ధం చేశారు.
గ్రామాలు, మండల కేంద్రాల్లో అన్ని దుకాణాలు తెరచుకోవడం, పట్టణాల్లో 50 శాతం దుకాణాలు తెరచుకోవడం వల్ల రహదారులపై జనం రద్దీ తీవ్రమైంది. చాలా చోట్ల జనం భౌతిక దూరాన్ని పాటించడం లేదు. మాస్కులు ధరించకుండానే రోడ్లపైకి వస్తున్నారు.
జోగులాంబ గద్వాల జిల్లా మినహా మిలిగిన 4 జిల్లాల్లో కంటైన్మెంట్ జోన్లు ఎత్తివేయడం వల్ల వాహనాల రద్దీ పెరిగింది. బుధవారం వనపర్తి జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. చాలా చోట్ల ప్రజలు రద్దీగా ఉండటం, మాస్కులు లేకుండా కొనుగోళ్లు జరపటం, భౌతిక దూరం పాటించకపోవటం వంటివి గమనించారు. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని దుకాణదారులను, వినియోగదారులను హెచ్చరించారు.
మద్యం దుకాణాల వద్ద బారులు..