దేశంలో పెరుగుతున్న అసమానతలు, నిరుద్యోగం, హింస వల్లే తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొందని ఆచార్య హరగోపాల్ అన్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త చట్టాలు బయటకు వస్తున్నాయని పేర్కొన్నారు. మహబూబ్నగర్లో ఏర్పాటు చేసిన శాంతి, సామరస్యం, పౌరసహజీవనం సదస్సులో కేంద్ర సమాచార మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్తో కలిసి పాల్గొన్నారు. మౌలిక, ఆర్థిక సమస్యలు, అసమానతలు పరిష్కారమైతే ఆ చట్టాలు నిలవకుండా పోతాయని హరగోపాల్ అన్నారు.
సీఏఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్సీ వ్యతిరేక సదస్సు
మహబూబ్నగర్లో శాంతి, సామరస్యం పౌరసహజీవనం సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆచార్య హరగోపాల్, మాడభూషి శ్రీధర్ హాజరయ్యారు. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్సీ భారతదేశానికి అవసరం లేని చట్టాలని అన్నారు.
ఏ దేశంలో పుట్టిన వారు ఆ దేశ పౌరులు అనేది అంతర్జాతీయ సూత్రమని కేంద్ర సమాచార మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. అందుకు భిన్నంగా చట్టాలు చేయకూడదని, చేసినా అవి చెల్లవన్నారు. సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ దేశానికి అవసరం లేదన్నారు. చొరబాటుదారులను బయటకు పంపాలనుకుంటే అందుకనుగుమంగా చర్యలు తీసుకోవాలి కానీ పౌరసత్వాన్ని ప్రజల నుంచి దూరం చేయకూడదన్నారు. ఈ విషయాన్ని శాంతిపూర్వకంగా చెప్పేందుకు సదస్సులు నిర్వహిస్తున్నారు.
ఇవీ చూడండి:ప్రగతిలో భేష్: దేశానికే ఆదర్శంగా తెలంగాణ: గవర్నర్