తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎఫెక్ట్: పేద విద్యార్థులకు స్మార్ట్​ఫోన్​లు అందించిన ఎమ్మెల్యే - పేద విద్యార్థులకు ఎమ్మెల్యే స్మార్ట్ ఫోన్​ల పంపిణీ

టీవీ, స్మార్ట్​ఫోన్​ లేకపోవడం వల్ల ఆన్​లైన్​ తరగతులకు దూరమయ్యారని... ఈనాడు-ఈటీవీ భారత్​లో వచ్చిన కథనానికి పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి స్పందించారు. వారి పరిస్థితిపై ఆరా తీసి... స్మార్ట్​ఫోన్​లు అందించారు.

parigi mla mahesh reddy distribute samrt phones in pagidyala for poor students
ఎఫెక్ట్: పేద విద్యార్థులకు స్మార్ట్​ఫోన్​లు అందించిన ఎమ్మెల్యే

By

Published : Sep 3, 2020, 5:17 AM IST

కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆన్​లైన్​ తరగతులకు... మహబూబ్ నగర్ జిల్లా గండేడ్ మండలం పగిడ్యాలలో కొంతమంది విద్యార్థులు దూరమయ్యారు. టీవీలు, స్మార్ట్​ఫోన్​లు లేకపోవడం వల్లనే ఇలా జరిగిందని... ఈటీవీ భారత్​లో కథనం వచ్చింది. కథనానికి స్పందించిన పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి... పగిడ్యాలకు వెళ్లి విద్యార్థుల పరిస్థితిపై ఆరా తీశారు.

విద్యార్థులంతా నిరుపేద కుటుంబానికి చెందినవారు కావడం, తల్లిదండ్రులు లేనివారు ఉన్నారని ఎమ్మెల్యే దృష్టికి వచ్చింది. అందుకే ఆన్​లైన్​లో పాఠాలు వినలేకపోయారని తెలుసుకొని... వారికి స్మార్ట్​ ఫోన్​లు కొనిచ్చాడు. ఈ విద్యార్థుల దయనీయ పరిస్థితి ఈటీవీ భారత్​ వెలుగులోకి తేవడం వల్లనే... వారిని ఆదుకునే అవకాశం కలిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మారుమూల గ్రామాల్లోని సమస్యలు వెలికి తీయడంలో ఈనాడు-ఈటీవీ భారత్​ ముందంజలో ఉంటాయని ప్రశంసించారు.

ఇదీ చదవండి:దేశంలో మరో 78,357 కేసులు, 1045 మరణాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details