పాలమూరు విశ్వవిద్యాలయ రెండో స్నాతకోత్సవాన్ని బుధవారం నిర్వహిస్తున్నట్టు ఉపకులపతి రాజారత్నం తెలిపారు. ఈ కార్యక్రమానికి మద్రాసు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్యులు త్యాగరాజన్ హాజరవుతున్నట్లు వివరించారు. రాష్ట్ర గవర్నర్ హాజరు కావాల్సి ఉండగా అనివార్య కారణాలవల్ల రాలేకపోతున్నారని తెలిపారు. మొదటి స్నాతకోత్సవాన్ని 2014లో నిర్వహించగా... ఐదేళ్ల తర్వాత రెండోవది నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఉత్తమ ప్రతిభ కనబర్చిన 115 మంది విద్యార్థులకు బంగారు పతకాలను అందజేయనునట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ పరిధిలోని 95 కళాశాలలకు చెందిన విద్యార్థులకు పీజీ, గ్రాడ్యుయేషన్ ధ్రువపత్రాలను అందుజేయనున్నారు.
పాలమూరు సంబురాలు - palamuru university 2nd Convocation celebrations
రెండో స్నాతకోత్సవ సంబురాలకు పాలమూరు విశ్వవిద్యాలయం సిద్ధమైంది. వర్శిటీ పరిధిలోని కళాశాల విద్యార్థులకు పీజీ, డిగ్రీ ధ్రువపత్రాలను అందజేయనున్నట్లు ఉప కులపతి రాజారత్నం తెలిపారు.
పాలమూరు సంబురాలు
ఇవీ చూడండి:
TAGGED:
పాలమూరు సంబురాలు