Palamuru Rangareddy Project Inauguration పాలమూరులో కృష్ణమ్మ పరుగులు.. నేడే పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రారంభం Palamuru Rangareddy Project Inauguration Today :రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని(PRLIS) ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ జాతికి అంకితం చేయనున్నారు. హైదరాబాద్ ప్రగతిభవన్ నుంచి రోడ్డు మార్గాన నాగర్‌కర్నూల్ చేరకోనున్న కేసీఆర్.. అక్కడే మధ్యాహ్న భోజనం చేయనున్నారు. అనంతరం కొల్లాపూర్ మండలంలోని నార్లాపూర్ పంప్‌హౌస్ కంట్రోల్ రూం వద్దకు చేరుకుంటారు.
Palamuru Rangareddy Lift Irrigation Opening Today :తొలుత పాలమూరు-రంగారెడ్డి పథకం పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత మొదటిదశ పంపింగ్‌ను స్విచ్ ఆన్ చేసి ప్రారంభిస్తారు. అక్కడే మొక్కలు నాటుతారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్విచ్ ఆన్ చేయగానే.. శ్రీశైలం వెనుక జలాల నుంచి అప్రోచ్ కెనాల్, ఇంటెక్ వెల్, సొరంగమార్గాల ద్వారా అప్పటికే సర్జ్‌పూల్‌కు చేరిన కృష్ణా జలాలు మొదటి పంపు నుంచి డెలివరి సిస్టర్న్ ద్వారా నార్లాపూర్ జలాశయానికి చేరుకుంటాయి.
CM KCR Meeting at Kollapur :కృష్ణమ్మ పొంగి పాలమూరు గడ్డపై అడుగుపెట్టే నార్లాపూర్ జలాశయం డెలివరి సిస్టర్న్ వద్ద.. ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కృష్ణమ్మకు గంగాహారతి చేపడతారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా నార్లాపూర్ జలాశయానికి చేరిన కృష్ణా జలాలను ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల గ్రామాలకు చేర్చాలని ఇప్పటికే కేసీఆర్ నిర్ణయించారు.
Palamuru Rangareddy Dry Run Success : 'పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆవిష్కృతం.. తెలంగాణ సాగునీటి రంగంలో మరో కాళేశ్వరం'
ఈ మేరకు కలశాలల్లో కృష్ణా జలాలను నింపి గ్రామదేవతల కాళ్లు కడిగి, అభిషేకాలు చేయనున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోత పథకం ప్రారంభోత్సవ దృశ్యాలను బహిరంగసభ వేదిక వద్ద అందరికి కనిపించేలా భారీ తెరల ద్వారా ప్రజలకు చూపించనున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను జాతికి అంకితం చేసిన అనంతరం.. కొల్లాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి చేరుకోనున్నారు.
CM KCR Kollapur Meeting :అక్కడి నుంచి కొల్లాపూర్ సమీపంలోని సింగోటం కూడలి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో కేసీఆర్ పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి సభకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని గ్రామాల ప్రజలు హజరయ్యే విధంగా.. ప్రతి నియోజకవర్గం నుంచి 5వేల మంది చొప్పున బహిరంగసభకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఇంజినీరింగ్ అద్భుతంగా భావిస్తున్న జనం.. నీళ్లెత్తిపోసే జలదృశ్యాన్ని వీక్షించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు వరప్రదాయినిగా మారనుందని విశ్రాంత ఇంజినీర్లు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి సభకు యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. నార్లాపూర్ పంప్‌హౌస్ వద్ద అదికారులకు మినహా ఇతరులు ఎవ్వరు వెళ్లకుండా పోలీసులు అంక్షలు విధించారు. ముఖ్యమంత్రి రోడ్డు మార్గాన వస్తున్నందున 3 వేల మంది సిబ్బందితో పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
"నేడు ముఖ్మమంత్రి కేసీఆర్.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించనున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టులో పంప్‌హౌజ్‌లు, రిజర్వాయర్లు, టన్నెల్స్.. దాదాపు అన్ని పనులు పూర్తయ్యాయి. కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు రాగానే.. కేసీఆర్ ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నారు." - శ్రీనివాస్‌గౌడ్, ఆబ్కారీ శాఖ మంత్రి
Niranjan Reddy on Palamuru Rangareddy Project : 'ఈ శతాబ్దపు అతి పెద్ద విజయం.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు'
Palamuru Rangareddy Lift Irrigation Project : పాలమూరు-రంగారెడ్డితో 12.30 లక్షల ఎకరాలకు సాగు నీరు.. 1200పైగా గ్రామాలకు తాగునీరు