Palamuru Rangareddy Project Dry Run in a week : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం( Palamuru Rangareddy Project )లో పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు నీటి పారుదల శాఖ( Irrigation Department ) కసరత్తులు చేస్తోంది. సెప్టెంబర్ చివరి నాటికి కనీసం ఒక్క మోటారునైనా నడిపించేందుకు పనులు సాగుతున్నాయి. సమీపంలోని MGKLI ఎల్లూరు పంప్‌హౌజ్ నుంచి 11 KVA విద్యుత్ లైన్లను నార్లాపూర్ పంప్‌హౌజ్ వరకు నిర్మించగా ప్రస్తుతం స్విచ్ యార్డు పనులు జరుగుతున్నాయి.
Palamuru Rangareddy project in the final stage :పాలమూరు ఎత్తిపోతలలో ఒక్కో పంపు 145 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉన్నాయి. డ్రై రన్ కోసం 4 మెగావాట్ల విద్యుత్ కనెక్షన్లు తీసుకున్న అధికారులు.. అందుకు తగిన పనులు పూర్తి చేస్తున్నారు. డ్రైరన్ కోసం ఓ మోటారు సిద్ధంగా ఉండగా రెండో మోటారును బిగించే పనులు వేగంగా సాగుతున్నాయి. మొదటి పంప్ వెట్ రన్ చేసే సమయానికి రెండో పంప్ డ్రైరన్ నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. మోటారు సక్రమంగా నడుస్తుందా లేదా అన్నది డ్రైరన్‌లో 3-4 గంటల పాటు పరీక్షించనున్నారు.
Palamuru Rangareddy Liftworks :మొదటి మోటారు డ్రైరన్ అనంతరం తలెత్తిన ఇబ్బందులను సరిచేసి 15 రోజుల్లో వెట్ రన్ సైతం నిర్వహించనున్నారు. అయితే, దీనికోసం శ్రీశైలం వెనకజలాల నుంచి ఎత్తిపోసుకునేందుకు అనుగుణంగా కృష్ణా జలాలు అందుబాటులో ఉండాలి. ప్రస్తుతానికి కావాల్సిన మేర నీళ్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 260 మీటర్ల వరకు నీరు ఉన్నందున వెట్‌రన్ చేసేందుకు కూడా అవకాశం ఉందని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రాజెక్ట్ మోటార్లు నడిపేందుకు 244.4 మీటర్ల మేర నీరు ఉంటే సరిపోతుంది.