'ఒట్టేసి ఓటేద్దాం' కార్యక్రమంలో కలెక్టర్ రొనాల్డ్ రోస్ ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే... వారికే ఓటు వేసే పరిస్థితి వచ్చిందని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు పని చేయడం లేదని బాధపడే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్పై విద్యార్థులకు, అంగన్వాడీ కార్యకర్తలకు ఏర్పాటు చేసిన 'ఒట్టేసి ఓటేద్దాం' కార్యక్రమంలో పాల్గొన్నారు.
నోటుకు, మద్యానికి లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకుంటామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.