కరోనా వైరస్ నేపథ్యంలో ఈ-ఆఫీస్ విధానానికి చాలా ప్రాముఖ్యత ఉందని మహబూబ్‌నగర్ జిల్లా పాలనాధికారి ఎస్.వెంకట్రావు పేర్కొన్నారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ-కార్యాలయం నిర్వహణపై మండల స్థాయి అధికారులతో సమీక్షించారు.
ఈ-ఆఫీస్ ద్వారానే కార్యకలాపాలు నిర్వహించాలి: కలెక్టర్ - మహబూబ్‌నగర్ జిల్లా తాజా వార్తలు
కలెక్టరేట్ నుంచి మొదలుకొని గ్రామ పంచాయతీ వరకు ప్రతీ కార్యాలయం ఈ-ఆఫీస్ ద్వారానే కార్యకలాపాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు అధికారులను ఆదేశించారు. ఈ కార్యాలయం నిర్వహణపై మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ-ఆఫీస్ ద్వారానే కార్యకలాపాలు నిర్వహించాలి: కలెక్టర్
అన్ని కార్యాలయాలు ఈ-కార్యాలయం పరిధిలోకి రావాలని అధికారులకు తెలిపారు. అందుకు అనుగుణంగా త్వరతగతిన ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని అన్ని కార్యాలయాలు ఇప్పటికే ఈ-ఆఫీస్ పరిధిలో కొనసాగుతున్నాయన్నారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం అన్ని కార్యకలాపాలను ఈ-కార్యాలయం ద్వారా మాత్రమే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిందని వివరించారు.
ఇదీచూడండి: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. ఈసారి ఇంట్లోనే జరుపుకుందాం