మమబూబ్‌నగర్ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ఆన్‌లైన్ ప్రజావాణికి 16 ఫిర్యాదులు వచ్చాయి. కొవిడ్19 కారణంగా ఆన్లైన్లో ప్రజావాణి నిర్వహిస్తున్నారు. 16 మంది తమ ఫిర్యాదులను వాట్సప్ వీడియోకాల్ ద్వారా అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.
ఆన్‌లైన్ ప్రజావాణికి 16 ఫిర్యాదులు - తెలంగాణ తాజా వార్తలు
మహబూబ్నగర్ పట్టణంలో వెంటనే శానిటైజేషన్ డ్రైవ్ నిర్వహించాలని సంబంధిత అధికారులను అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు కావడం వల్ల.. ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదులను స్వీకరించారు.
![ఆన్‌లైన్ ప్రజావాణికి 16 ఫిర్యాదులు ఆన్‌లైన్ ప్రజావాణికి 16 ఫిర్యాదులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8803625-499-8803625-1600133300940.jpg)
ఆన్‌లైన్ ప్రజావాణికి 16 ఫిర్యాదులు
వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఫిర్యాదులలో ముఖ్యంగా భూములకు సంబంధించిన సమస్యలు, పింఛన్లు, పారిశుద్ధ్యానికి సంబంధించినవి ఉన్నాయని అధికారులు తెలిపారు. పారిశుద్ధ్య సమస్యకు సంబంధించి పట్టణంలోని అన్ని వార్డుల్లో శానిటైజేషన్ డ్రైవ్ నిర్వహించాని పుర అధికారులకు అదనపు కలెక్టర్ ఆదేశించారు.
ఇదీ చూడండి:వ్యవసాయ బిల్లులపై రైతులకు కేంద్రం భరోసా