తెలంగాణ

telangana

ETV Bharat / state

దేవరకద్ర మార్కెట్​లో ఉల్లి పోటు - Onion rates increasing updates

ఉల్లి ధర మండుతోంది. పేద, మధ్య తరగతి ప్రజలకు ఉల్లిగడ్డ కన్నీరు పెట్టిస్తోంది. రోజురోజుకు ధర పెరుగుతూనే ఉంది. మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర మార్కెట్​లో గత వారంతో పోలిస్తే క్వింటా ఉల్లి రూ. 400 దాకా పెరిగి మంట పెడుతోంది.

Onion rates increasing in devarakadra
పెరిగిన ఉల్లి ధర

By

Published : Dec 4, 2019, 5:13 PM IST

మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర వ్యవసాయ మార్కెట్​లో ఉల్లికి బహిరంగ వేలంలో మంచి ధర లభించింది. గత వారంతో పోలిస్తే క్వింటాకు రూ. 400 పెరిగింది. మండలంలోని వివిధ గ్రామాల నుంచి రైతులు తీసుకొచ్చిన ఉల్లికి క్వింటాకు ధర రూ. 5,000 నుంచి రూ. 7, 800 వరకు కొనసాగింది. నాణ్యతలేని చిన్న చిన్న పేడు ఉల్లి సైతం రూ.3000 ధర పలకడం గమనార్హం.
ఈ ధరలకు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నా.. పేద, మధ్యతరగతి వినియోగదారులు మాత్రం ఉల్లిని కొనేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పెరిగిన ఉల్లి ధర

ABOUT THE AUTHOR

...view details